యూనిఫామ్ లో సూపర్ డాన్స్ చేసిన పోలీసులు.. కానీ పాపం?

praveen
సాధారణంగా పోలీసులు అన్న తర్వాత ఎప్పుడు నేరాలు అరికట్టడంలో బిజీ బిజీగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందరికీ సండే హాలిడే ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం సండే కూడా లీవ్ తీసుకోకుండా పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు నేరస్తులను జైలుకు తరలించడం జైలు నుంచి కోర్టుకు తరలించడం ఇలా బిజీబిజీగా ఉంటారు. కానీ పోలీసులు కూడా మనుషులే కదా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఎంజాయ్ చేయాలి అని అనిపించినా కూడా ఎప్పుడైనా ఖాకి డ్రెస్ లేనప్పుడు ఎంజాయ్ చేస్తారు. కానీ యూనిఫాంలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు గంభీరంగానే కనిపిస్తూ ఉంటారు పోలీసులు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం అలా కాదు.

 యూనిఫామ్ లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు. అనుకోవడమేంటి అనుకున్నదే తడువుగా ఏకంగా యూనిఫామ్ ఒంటి మీద ఉన్నప్పటికీ కూడా సినిమా పాటలపై డాన్సులు చేశారు. ఒక్కరు ఇద్దరు కాదు స్టేషన్లో ఉన్న అందరూ కూడా కాలు కదిపి తమలో ఉన్న డాన్సర్ను బయటపెట్టేసారు. ఇంకొకరు ఈ హ్యాపీ మూమెంట్ను సెల్ఫోన్లో వీడియో తీశారు. ఇంకేముంది ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా గడుపుకున్నాము అని ఆ పోలీసులు అందరూ అనుకుంటున్న సమయంలో పైఅధికారులు మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు.

 ఇలా ఆగస్టు 15వ తేదీన యూనిఫాం వేసుకుని డాన్స్ చేసిన పోలీసులు అందరినీ కూడా సస్పెండ్ చేస్తూ పైఅధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పాటు వీరిని సస్పెన్షన్ చేశారు. ఈ ఘటన నాగ్పూర్ లోని తహసిల్ పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ సంజయ్ పాఠంకర్, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖయ్యూం గని, భాగ్యశ్రీ గిరి, కానిస్టేబుల్ నిర్మల డాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియో వైరల్ గా మారిపోవడంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి కాకి డ్రెస్ లో ఇలా డాన్సులు చేసినందుకు వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంతోషంగా గడిపిన ఆ ఖాకిలకు ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: