అబ్బాయిలను డేటింగ్ స్కామ్‌లోకి దింపుతున్న ముంబై అమ్మాయిలు..??
ముంబైలో యంగ్ లేడీస్ చేస్తున్న ఒక పెద్ద ఘరానా మోసం బయటపడింది. కొంతమంది యువతులు కొన్ని నైట్ క్లబ్‌లతో కలిసి ఈ మోసపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై నిజం తెలుసుకోవడానికి, నేషనల్ మీడియా రిపోర్టర్లు నైట్ క్లబ్‌లలోకి వెళ్లి రహస్యంగా విచారణ చేశారు. వారు చేసిన విచారణలో ఏమి తెలిసిందంటే, ఈ నైట్ క్లబ్‌లు కొన్ని యువతులకు ఉచిత గది, రోజువారీ ఖర్చులు ఇస్తున్నాయి. దీనికి బదులుగా ఆ యువతులు డేటింగ్ యాప్‌ల ద్వారా మగవారితో పరిచయం చేసుకొని వారిని ఈ నైట్ క్లబ్‌లకు తీసుకువెళతారు. నైట్ క్లబ్ ఓనర్లు కొద్ది సమయంలోనే ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేయాలని ఆ యువతులతో చెబుతున్నారు.
కొంతమంది రిపోర్టర్లు డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైల్‌లు సృష్టించిన కొద్ది గంటల్లోనే చాలా మంది స్త్రీలు వారితో డేట్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపించారు. కొన్ని నైట్ క్లబ్‌లు మగవారిని ఆర్థికంగా మోసం చేయడానికి యువతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్లబ్‌లు తమ వ్యాపారాన్ని పెంచడానికి PR సిబ్బందిని నియమిస్తాయి. కానీ ఇతర క్లబ్‌లతో పోటీ పెరిగిన కారణంగా, ఈ PR సిబ్బంది మోసపు పద్ధతులను అవలంబిస్తున్నారు.
కొంతమంది యువకులు హర్యాణా నుంచి హైదరాబాద్‌లోని కొన్ని క్లబ్‌లు నడుపుతున్నారు. అలానే అమ్మాయిలను రంగంలోకి దింపుతున్నారు. డేటింగ్ యాప్‌ల ద్వారా మగవారితో పరిచయం చేసుకునేలా తమ స్వస్థలం నుంచి యువతులను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువతులు ఉచిత గది, డబ్బు ఆఫర్ చేస్తున్నారు. వారు త్వరగా మగవారితో డేట్‌కు వెళ్లి, వారిని క్లబ్‌లకు తీసుకువచ్చి, కొద్ది సమయంలోనే ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేసి మోసం చేస్తున్నారు. ఆ తర్వాత యువతులు ఆ మగవారిని వదిలేసి వెళ్లిపోతారు. క్లబ్ ఉద్యోగులు మగవారిని బిల్లులు చెల్లించేలా ఒత్తిడి చేస్తారు. యువతులు మొత్తం బిల్లులో 15 నుండి 20 శాతం వరకు తీసుకుంటారు. ముంబైలో ఇలాంటి డేటింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే దారుణంగా మోసపోయే లేదంటే తన్నులు తినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.