పిచ్చి తగలెయ్యా.. ఏలియన్స్ కి పూజలు చేస్తున్నాడు?
ఇక ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యం కలగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఎంతో మంది పూజ చేయాలంటే గుడికి వెళుతూ ఉంటారు. కొంతమంది ఏకంగా గుడి కట్టి మరి పూజలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో అభిమాన నటీనటులకు కూడా ఎంతో మంది ప్రేక్షకులు గుడి కట్టిస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మానాన్నలనే దేవుళ్ళుగా భావించి గుడి కట్టించి పూజిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా సినీ సెలబ్రిటీలను అమ్మా నాన్నలకు గుడి కట్టించి పూజించడం గురించి ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నాము చూసాము కూడా. కానీ ఇక్కడ మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఏకంగా మనుషులకు దేవుళ్ళకి కాదు ఏకంగా ఏలియన్లకు గుడి కట్టి పూజిస్తున్నాడు.
వినడానికే విచిత్రంగా ఉంది కదా. తమిళనాడులో ఇలాంటి ఒక విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సేలంలో ఉండే సిద్దర్ అనే వ్యక్తి ఆగస్త్య మహర్షితోపాటు ఏలియన్ కు గుడి కట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. అయితే శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతర వాసులు పుట్టారని.. ఇక ఈ విషయాన్ని అగస్యుడు గ్రంథాలలో రాశాడని.. అతను చెబుతూ ఉండడం గమనార్హం. అందుకే ఏలియన్లకు గుడి కట్టి మరీ పూజిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకే అతను ఇలా చేస్తున్నాడు కామెంట్లు చేస్తుంటే.. ఎవరికి పిచ్చి వాళ్లకి బాగానే ఉంటుంది అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.