గ్రామంలో.. ఇద్దరు వ్యక్తుల పంచాయితీ తెగొట్టిన గేదె.. ఎలాగంటే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఘటనలు తెగ నవ్విస్తూ ఉంటాయి. మరికొన్ని ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన అయితే అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి.

 సాదరణంగా గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చింది అంటే చాలు దానిని పంచాయితీ పెట్టి ఊరు పెద్దలు ఇక పంచాయతీని పరిష్కరించడం చేస్తూ ఉంటారు. కుటుంబ సమస్యల దగ్గర నుంచి భూముల సమస్యల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా పంచాయతీ పెట్టి ఏదో ఒక తీర్మానం చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగానే ఇలా పంచాయతీ తీర్పులు ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం మనిషి కాదు ఏకంగా ఒక గేదె పంచాయితీని తెల్చేసింది. ఏంటి సాధారణంగా మనుషులు కదా పంచాయిని తెగ్గొట్టేది కానీ గేదె ఇలా పంచాయితీ తెగ్గొట్టడం ఏంటి అనుకుంటున్నారు కదా.

 కానీ ఉత్తర ప్రదేశ్ లోనే ప్రతాప్ ఘడ్ ప్రాంతంలో మాత్రం ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తుల పంచాయితీని ఒక గేదె సులువుగా తీర్చేసిన ఘటన జరిగింది. నందలాల్ కు చెందిన గేదె తప్పిపోగా దాన్ని హనుమాన్ అనే వ్యక్తి తన ఇంట్లో కట్టేసి తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. అయితే ఈ వివాదంఫై పోలీసులు పంచాయితీ చేసిన ఫలితం దక్కలేదు. దీంతో ఇరువురు రోడ్డుకు చేరువైపు వెళ్లాలని.. గేదె ఎవరిని అనుసరిస్తే వారికే సొంతం అంటూ చెప్పారు అధికారులు. అయితే ఆ గేదె యజమాని నందాలాల్ వైపుకే వెళ్లడంతో ఇక అతనికి ఆ గేది సొంతం అని తీర్పును ఇచ్చారు. ఇలా ఏకంగా ఒక గేదే పంచాయతీని తీర్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: