ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాకపోతే.. ఇదంతా అవసరమా బ్రో?

praveen
నేటి రోజుల్లో ప్రతి మనిషి స్మార్ట్ ఫోన్ యుగంలోనే గడిపేస్తున్నాడు. అరచేతిలో స్మార్ట్ఫోన్ లేకుండా అర క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. మొబైల్ లేదంటే పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తున్న మనుషులు కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఇక ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరిని ఆకట్టుకోవడంతో... ఇలా ఇంటర్నెట్ మాయలో మునిగిపోతున్నారు జనాలు.

 ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కొంతమంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఏకంగా ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకొని సైతం విన్యాసాలు చేస్తున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉంది. అయితే కొంతమంది ఇలాంటి విన్యాసాలు చేసి  చివరికి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇక్కడ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది యువకులు చేసిన డేంజరస్ స్టంట్ కి సంబంధించిన వీడియో చూసి ఇంటర్నెట్ జనాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

 కదులుతున్న కార్ డోర్ కి ఒక వ్యక్తి తనను తాను వేలాడ దీసుకుని నవ్వుతున్న వీడియో వైరల్ గా మారిపోయింది. కొంతమంది యువకులు కలిసి కారులో కూర్చుని ప్రయాణిస్తున్నారు. మరో వ్యక్తి వెనుక సీట్లో కూర్చొని నవ్వుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే టేపుతో తనను తాను వేలాడ దీసుకున్న ఒక వ్యక్తి కూడా ఇలా నవ్వుతూ ఉండడం వీడియోలో చూడవచ్చు. ఇక ఏ మాత్రం తేడా కొట్టిన ఇలా ప్లాస్టిక్ టేప్ కట్టుకొని వేలాడుతున్న వ్యక్తి అదే కార్ కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి ప్రయత్నం చేశారు అన్న విషయం అర్థమవుతుంది. ఇది చూసి ఇంటర్నెట్ జనాలు షాక్ అవుతున్నారు. ఇక ఈ వీడియో పై విమర్శలకు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: