చిన్నపాటి నిర్లక్ష్యంతో.. టెక్కీ ఎలా చనిపోయాడో చూడండి?

praveen
మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అని అస్సలు ఊహించటం చాలా కష్టం. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని ఊహించని ఘటనలు చివరికి ప్రాణాల మీదికి తీసుకువస్తూ ఉంటాయి. మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏకంగా నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటాయన్న విషయం తెల్సిందే. ఇక ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగిన కూడా సోషల్ మీడియా కారణంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా చూసేయగలుగుతున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.

 సాధారణంగా నీటి సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి ఇంట్లో కూడా ఒక నీటి సంపును ఏర్పాటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలా నేటి రోజుల్లో నీటి సంపు లేని ఇల్లు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నీటి సంపు విషయంలో కొంతమంది చేసే చిన్న చిన్న పొరపాట్లు చివరికి అభం శుభం తెలియని మనుషుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనలు జరిగింది. ఏకంగా ఒక టెక్కి నీటి సంపు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా నీటి సంపూ మూత పెట్టకపోవడంతో నిండు ప్రాణం బలయింది.

 అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అందరూ షాక్ అయ్యారు. 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి షేక్ అక్మల్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో షణ్ముఖ పురుషుల పిజి హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే బయటకి  బయటకు వెళ్లి వస్తుండగా.. గేటు తెరిచి తెలియకుండానే.. ఇక మూత తెరిచి ఉన్న సంపులో పడిపోయాడు. అయితే చుట్టుపక్కల వారు అతను పడిపోయింది చూడలేదు. దీంతో ఒక వ్యక్తి మాత్రం నీటి సంపును మూత పెట్టలేదని ఓ మహిళను తిట్టినట్లు కనిపించాడు. ఇంకా అందులో టెక్కి పడిపోయాడని విషయాన్ని గమనించినట్టు తెలియ రాలేదు. అయితే ఇలా నీటి సంపులో పడిన సమయంలో తలకి బలమైన గాయం కావడంతో చివరికి ఇలా సంపులో పడిపోయిన టెక్కి ప్రాణాలు పోల్పోయాడు. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: