రూ.200 కోట్లు దానం చేసి.. ఇప్పుడు బిక్షాటన చేయబోతున్నారట?

praveen
మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయిందా అంటే.. కొంతమంది చేసే దానధర్మాల గురించి తెలిసిన తర్వాత ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది  సాధారణంగా ఎవరైనా వ్యక్తులు ఇలా సహాయం చేయాలి అనుకున్నప్పుడు తమ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడం చూస్తూ ఉంటాం. కొంతమంది భారీగా విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఎవరైనా తమ దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని ఇలా దానం చేస్తారా.

 అలా ఎందుకు చేస్తారు.. అలా చేస్తే వారి పరిస్థితి ఏంటి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే దంపతులు మాత్రం ఇలాంటిదే చేశారు. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా భిక్షాటన చేస్తున్నవారు కనిపిస్తే.. వారికి ఎంతో కొంత సహాయం చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే  దంపతులు ఏకంగా తమకు ఉన్న యావదాస్తి మొత్తాన్ని కూడా దానం చేసి ఇక ఇప్పుడు భిక్షాటన చేయడానికి రెడీ అయ్యారు. దానం చేశారు అంటే ఏదో లక్షలు అనుకునేరు. ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేశారు ఆ దంపతులు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ఘటన నిజంగానే గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది.

 జైన మతానికి చెందిన పారిశ్రామికవేత్త బవేష్ భాయ్ బండారి ఆయన భార్య ఇకపై సన్యాసం స్వీకరించి భిక్షాటనతో రోజువారి జీవనం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా.. వారు 2022లోనే సన్యాసం స్వీకరించారు. ఇలా వారి పిల్లల నిర్ణయం ఈ దంపతులను కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీంతో ఏప్రిల్ 22వ తేదీన భవేష్ భాయ్ దంపతులు కూడా సన్యాసం స్వీకరించేందుకు రెడీ అయ్యారట. ఈ క్రమంలోనే ఇక తమ 200 కోట్ల ఆస్తి మొత్తాన్ని కూడా విరాళంగా ఇచ్చేసి ఇక ఇప్పుడు సన్యాసిగా మారి భిక్షాటనతోనే రోజు వారి జీవితాన్ని గడిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: