ఆ రెండు దేశాలకు ఎవరు వెళ్లొద్దు.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక?

praveen
ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్నారు. ఇక ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక వేల మంది సైనికులు కూడా నేలకొరిగారు. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగిన ఫలితం మాత్రం లేకుండా పోయింది. అయితే ఇలా రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇంకో కొత్త యుద్ధం పుట్టుకొచ్చింది.

 హమాస్, ఇజ్రాయిల్ మధ్య గత కొన్ని నెలల నుంచి తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఏకంగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ ను టార్గెట్గా చేసుకొని బాంబుల వర్షం కురిపించడంతో తమ దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉండే ఇజ్రాయిల్ ఇక మెరుపు దాడులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ మెరుపు దాడుల్లో ఇక ఎంతోమంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ సహా ఇరాన్ లాంటి దేశాలలో ఉన్న భారతీయుల రక్షణ ఇక భారత విదేశాంగ శాఖకు పెద్ద సవాల్ గా మారింది అని చెప్పాలి. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సోలేట్ ఫై ఇజ్రాయిల్ వైమానిక దాడికి పాల్పడింది.

 దీంతో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు కూడా వెళ్లాలి అనుకునే భారతీయులందరికీ భారత విదేశాంగ శాఖ కీలకమైన సూచనలు చేసింది. తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఇక ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు భారతీయులు ఎవరు కూడా వెళ్ళవద్దు అంటూ హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు ఇండియన్ ఎంబసీ తో టచ్ లో ఉండాలి. తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటూ సూచించింది భారత విదేశాంగ శాఖ. అయితే ఇరాన్ కాన్సోలేట్  పై ఇజ్రాయిల్ దాడి చేయడంతో.. ఇక ఇప్పుడు ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: