అందం కోసం 43 సర్జరీలు.. చివరికి ఎలా మారిపోయిందో చూడండి?

praveen
ప్రస్తుతం అందు బాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు తీసుకువస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మనిషి తమకు నచ్చినట్టుగా అన్ని పనులు చేసేస్తూ ఉన్నాడు. అయితే ఒకప్పుడు ఎవరైనా అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు మేకప్ వేసుకోవడం లాంటివి చేసేవారు. నచ్చిన డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకుంటే తమ కంటే అందంగా ఇంకెవరూ లేరు అని ఎంతగానో ఆనంద పడిపోయే వారు. కానీ ఇప్పుడు మేకప్ పైన ఆధారపడటం కంటే ప్లాస్టిక్ సర్జరీల పైన ఆధారపడుతున్న జనాలే ఎక్కువగా కనిపిస్తున్నారు.

 దేవుడిచ్చిన రూపాన్ని తమకు ఎలా నచ్చితే అలా మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. ఇక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న వారు.. నేటి రోజుల్లో చాలా మంది కనిపిస్తున్నారు. ముక్కు మొఖం మాత్రమే కాదు బాడీలోని అన్ని భాగాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ యువతి ఇలా తన అందాన్ని మరింత పెంచుకునేందుకు ఒకటి కాదు రెండు కాదు 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. ముక్కు మొహానికి మాత్రమే కాదు వక్షోజాలకు సైతం ఆపరేషన్ చేయించుకుంది. చివరికి విచిత్రంగా మారిపోయింది.

 ఇరాక్ కు చెందిన దాలియా నయీమ్ అనే 30 ఏళ్ల యువతి బార్బీ గర్ల్ లాగా మారాలని అనుకుంది. దీనికోసం 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. దీంతో ఆమె పెదవులు లావుగా మారిపోయి.. ఫేస్ మొత్తం విచిత్రంగా మారిపోయింది. అందరి చేత బార్బీ గర్ల్ అని పిలిపించుకోవాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా నటిజన్స్ అందరూ కూడా ఆమెను జాంబి గర్ల్ అని డెవిల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో పిలవడం మొదలుపెట్టారు. కాగా ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 10 లక్షలు మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: