యూట్యూబర్ సాహసం.. టెర్రరిస్ట్ ని ఇంటర్వ్యూ చేయబోయాడు.. కానీ?

praveen
ఒకప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు మంచి ఉద్యోగం సంపాదించాలని తెగ ఆశపడేవారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తూ మంచి ఉద్యోగం సాధించేందుకు కష్టపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. చదువుకున్న చదువుకోలేకపోయినా ఎంతో మంది తమలో ఉన్న టాలెంట్ తో బాగా సంపాదించుకోగలుగుతున్నారు. యూట్యూబ్ అనేది ఇటీవల కాలంలో యూత్ కి ఒక పెద్ద ఆయుధంగా మారిపోయింది. యూట్యూబ్లో తమ టాలెంట్ ఏంటో నిరూపించుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు.

 తమలో దాగి ఉన్న క్రియేటివిటీకి పని చెబుతూ.. ఉద్యోగం వ్యాపారం చేసిన వారి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు చాలామంది  అయితే కొంతమంది ఇక యూట్యూబ్లో వీడియోలు చేయడం కోసం ఏకంగా విన్యాసాలు చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఇంకొందరు ఏకంగా లైఫ్ ను రిస్కులో పెట్టుకొని మరి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక యూట్యూబర్ ఏకంగా ఒక క్రేజీ వీడియో తీయాలని అనుకుని తన లైఫ్ ను రిస్క్ లో పెట్టుకున్నాడు.

 ఒక టెర్రరిస్టును యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యువకుడు చివరికి బందిగా మారాడు  అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్టు నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయాడు. కానీ చివరికి బందీగా మారిపోయాడు. హైతికి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబ్ ఆడిసన్ పిర్రె మాలవ్ హైతికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్లిన కాసేపటికి మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసింది. ఆరు లక్షల డాలర్లు డిమాండ్ చేస్తుంది. కాగా అతనికి యూట్యూబ్ లో 1.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. భయంకరమైన ప్రదేశాలను అన్వేషిస్తూ ఉంటాడు ఈ యూట్యూబర్. దీంతో అతనికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: