గుడిలోకి వచ్చిన పాము.. మెడలో వేసుకున్న భక్తుడు.. చివరికి?

praveen
సాధారణంగా పాములను చూస్తే తెలియకుండానే ఎందుకో వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కనిపించేది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ కూడా భయం మాత్రం ఆటోమేటిగ్ గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కళ్ళ ముందు పాము కనిపిస్తే భయపడి పోయి అక్కడ నుంచి పారిపోవడం లేదంటే పాము పైన దాడి చేయడం చేసే జనాలు ఇక ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే చాలు ఏకంగా దైవమే తమ ముందుకు పాము రూపంలో వచ్చింది అని నమ్ముతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఏకంగా పాముకు పాలు పోసి పూజించడం లాంటిది చేస్తుంటారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఇలా గుడిలోకి వచ్చే పాములు కూడా జనాలపై దాడి చేయకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ఇలా గుడిలోకి పాము వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ పాముకు హాని తల పెట్టరు. అయితే ఇక్కడ ఇలాగే గుడిలోకి పాము వచ్చింది. అయితే పాము వచ్చిన తర్వాత అనూహ్య ఘటన జరిగింది. కేరళలోని గురువాయూర్ అంబాలనాడ గుడిలోకి పాము వచ్చింది. రాత్రి 11 గంటలకు సమయంలో ఉత్తరం వైపు ఉన్న గేట్ సమీపంలోకి పాము రావడంతో భద్రత సిబ్బంది పోలీసులు పామును నిర్జన ప్రదేశానికి తరిమేశారు.

 అయితే నారాయణాలయం వైపు పాకుతున్న పామును సునీల్ కుమార్ అనే వ్యక్తి చూశాడు. ఈ క్రమంలోనే ఆ పామును ఏకంగా భుజాలపై పెట్టుకుని భద్రత సిబ్బంది వద్దకు తీసుకువచ్చాడు. అయితే పామును వదిలించుకోవాలని భద్రత సిబ్బంది చెప్పిన అతని వినలేదు. ఇంతలో పాము అతన్ని కాటు వేసింది. పాము కాటుకు గురైన అతను ఇక ఆ పామును విసిరేసాడు. ఇక స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు  అయితే ఇలా పాముకు కాటుకు గురైన సునీల్ కుమార్ ను వెంటనే అటు మెడికల్ సెంటర్ కు తరలించారు అధికారులు. ఇక ఈ ఘటనతో అందరూ ఒక సారిగా షాక్ లో మునిగిపోయారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: