కల్తీకి కాదేది అనర్హం.. ఎండుమిర్చికి కూడా రంగు మార్చేస్తున్నారుగా?

praveen
కల్తీ.. నేటి రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు కల్తీ అంటే కేవలం కొన్ని వస్తువులు మాత్రమే కల్తీ అయ్యేవి అని అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు కల్తీకి కాదేది అనర్హం అన్న రీతిలో కొంతమంది మోసగాళ్లు వ్యవహరిస్తున్నారు. అది ఇది అని తేడా లేకుండా అన్ని వస్తువులను కూడా కల్తీ చేసేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కూరగాయలు పండ్లు ఇలా అన్నింటినీ కూడా కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి పండేలా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అవి ఎప్పుడు ఫ్రెష్ గా ఉండే విధంగా మరికొన్ని రసాయనాలను వాడుతున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా చివరికి కల్తీ వస్తువులు వాడుతు ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా కల్తీ కి పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్న.. ఎక్కడ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు కల్తీగాళ్ళు. అయితే ఇక ఇప్పుడు సరికొత్త కల్తీ వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లపాటు ఇక మిర్చి పౌడర్ కొనుగోలు చేస్తే అందులో ఎర్రగా కారం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపించడానికి రంగు కలుపుతారు అని అందరూ అనుకునేవారు. అందుకే ఇక ఎండుమిర్చిని కొనుగోలు చేసి వాటిని పొడిగా చేయించుకుని వాడుకునేవారు. అలా చేయడం ద్వారా కల్తీ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకునేవారు. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం మిరపకాయలలో కూడా కల్తీ ఉంది అన్న విషయం అర్థమవుతుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఏకంగా పాడైపోయిన మిర్చీలను కొంతమంది మహిళలు రసాయనాలను కలిపిన ఎర్రటి నీటిలో ముంచి బయటకు తీసి పక్కన వేస్తున్నారు. అయితే ఇలా మిర్చిని పక్కన వేసిన తర్వాత ఆ మిర్చి ఏకంగా నిగనిగలాడుతూ ఎంతో ఎర్రగా కనిపిస్తుంది. అయితే ఇలా మిర్చిని కల్తీ చేస్తున్న చోటుకు వెళ్ళిన ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయినా మిర్చీని కూడా కల్తీ చేయడం ఏంటీ.. చిన్నప్పటినుంచి ఎప్పుడూ వినలేదు. ఇంకా కల్తీ కానిది ఇంకేముంది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఎండుమిర్చి కొనడం వల్ల అయినా కల్తీ లేని మిర్చి పౌడర్ దొరుకుతుంది అనుకుంటే ఇక ఇలా ఎండుమిర్చిని కల్తీ చేస్తే ఎలా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: