అతనొక వాచ్ మెన్.. కానీ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి?

praveen
ఇటీవల కాలంలో బాగా చదువులు చదివిన వారందరికీ కూడా ఒకే కోరిక బలంగా ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని. ఈ క్రమంలోనే ఇక అప్పటికే చదువుల కోసం పుస్తకాల పురుగుల ఉన్నవారు.. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం కోసం మరిన్ని ఎక్కువ పుస్తకాలు తెచ్చుకొని.. ఇక రూమ్ లో కూర్చొని తెగ చదివేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతల కాంపిటీషన్ ఉందో ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి కాంపిటీషన్లో ఉద్యోగాలు సంపాదించడం అంటే అది అంత సులభమైన విషయం ఏమి కాదు.

 ఏకంగా వందల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉంటే.. అటు లక్షల్లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు వస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఇటీవల కాలంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే చాలు అతనికి ఎక్కడో రాసిపెట్టి ఉందిలే అని అనుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు. నేటి రోజుల్లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా నేటి పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టం. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనినిరూపిస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా ఒకటికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి ఘనతనే సాధించాడు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. అదృష్టవంతుడు అంటే ఇతనే అనిపిస్తుంది కదా. కానీ ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు అతను పడిన కష్టం మాటల్లో వర్ణించలేనిది. అతను ఒక వాచ్మెన్. కానీ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. మంచిర్యాల జిల్లా పొణ్గల్ కు చెందిన ప్రవీణ్ ఎంకామ్, బీఈడీ, ఎంఈడి చేశారు. అయితే ఓయూలో ఈఎంఆర్సి లో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే  ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పోటీ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలోనే పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం అతను ఎంపికయ్యాడు. కాగా అతని తండ్రి తాపీ మేస్త్రి కాగా తల్లి బీడీ కార్మికురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: