ఐసీయూలో ఉన్న పేషంట్ పై అత్యాచారం.. చేసింది ఎవరో కాదు?

praveen
డాక్టర్ అంటే అర్థం ఏంటి అని అడిగితే.. కలియుగంలో కనిపించే ప్రత్యక్ష దైవం డాక్టర్.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఇంకొకరి ప్రాణాలను రక్షించేవాడు డాక్టర్. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో విరోచిత పోరాటం చేసినవాడు డాక్టర్. గుడిలో ఉన్న దేవుడైన వరాలు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఆసుపత్రికి వెళ్తే మాత్రం డాక్టర్ తప్పకుండా పునర్జన్మను ప్రసాదిస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా నిర్వచనం చెబుతూ ఉంటారు. అయితే ఇలా డాక్టర్ అనే గొప్ప వృత్తిలో కొనసాగుతున్న కొంతమంది మాత్రం నీచమైన పనులు చేస్తూ డాక్టర్ వృత్తికే కళంకం వచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఆరోగ్య సమస్య ఉంది అని తమ దగ్గరికి వచ్చిన పేషంట్లపై ఏకంగా దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వైద్యం చేస్తున్నాము అనే పేరుతో కొంతమంది నీచులు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇక్కడ ఇలాంటి ఓ దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం వచ్చిన యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

 రాజస్థాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ ఏకంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే అక్కడే పని చేస్తున్న కామాంధుడైన నర్సింగ్ అసిస్టెంట్ చిరాగ్ ఆ యువతి స్పృహ కోల్పోయేలా ఇంజక్షన్ ఇచ్చాడు. ఇక తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త ఫోన్ చేయడంతో స్పృహలోకి వచ్చిన సదరు మహిళ ఇక తనపై అత్యాచారం జరిగింది అన్న విషయాన్ని గ్రహించి వెంటనే భర్తకు విషయం తెలిపింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icu

సంబంధిత వార్తలు: