కార్ పార్క్ చేసి పొరపాటున కిటికీ తెరిచే ఉంచాడు.. ఇక మరునాడు ఏసి ఆన్ చేస్తే?

praveen
ఇటీవల కాలంలో కార్ల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఒకప్పుడు సంపన్నులు మాత్రమే కారు కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో పేద మధ్యతరగతి ప్రజల సైతం తమత తాహతకు తగ్గట్లుగా కారును తెచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక పెద్ద కార్ల నుంచి చిన్న కార్ల వరకు ఏ కారైనా సరే ఎక్కడైనా పార్క్ చేసి ఉన్నప్పుడు ఇక అన్ని డోర్లని క్లోజ్ చేసామా.. ఇక విండో అద్దాలని పూర్తిగా క్లోజ్ చేసామా లేదా అన్న విషయాల్ని ప్రతి ఒక్కరూ ముందుగా గమనించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం డోర్స్ సరిగ్గా క్లోజ్ చేయకుండానే పార్క్ చేసి  వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేసిన వారికి కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు ఇలాగే ఒక వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇది చేదు అనుభవం  అనడం కంటే ఒక భయానక అనుభవం అని చెప్పాలి. సాధారణంగా  ఆస్ట్రేలియా అంటేనే పాములు తేళ్లు విషపూరితమైన సాలిడ్లకు చిరునామాగా ఉంటుంది. అయితే ఇటీవల ఒక వ్యక్తికి ఏకంగా పాము షాక్ ఇచ్చింది ఇంతకీ ఏం జరిగిందంటే   ఇటీవల ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తూ ఏసీ ఆన్ చేశాడు  దీంతో ఒక్కసారిగా బయటికి వచ్చిన ఒక పామును చూసి షాక్ అయ్యాడు  అయితే ఇలా ఏసీ నుంచి బయటికి వచ్చిన పాము డ్రైవింగ్ చేస్తున్న అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది.

 మళ్లీ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఈ అనూహ్య ఘటనతో అతను ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. వెంటనే కారును రోడ్డు పక్కన ఆపేసి ఇక అందులో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటకి దిగిపోయారు. ఇక ఆ తర్వాత ఏకంగా మళ్ళీ పాము ఏసీ వెన్స్ నుంచి తల బయట పెట్టడం చూసి ఆ కుటుంబం మరింత భయాందోళనకు గురైంది. ఇక కాసేపు వాళ్లు అలాగే ఉండిపోయారు. తర్వాత ఆ పాము మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. తప్పని పరిస్థితుల్లో అదే కారులో ఏసీ ఆన్ చేయకుండా ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. రాత్రంతా కారు విండోను తెరిచి పెట్టడంతో మరునాటికల్లా అది వెళ్ళిపోయింది. క్వీన్స్ ల్యాండ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు రోజు కారు విండో తెరిచి ఉంచడం కారణంగానే ఆ పాము లోపలికి వచ్చింది అని సదరు వ్యక్తి గ్రహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: