ఆన్లైన్లో ఆరెంజ్ పండు కొన్నాడు.. కానీ డెలివరీ అయ్యాక షాక్?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభంగానే పూర్తి చేస్తూ ఉన్నాడు  ఈ క్రమంలోనే ఒకప్పటిలా ఏ పని చేయాలన్నా చెమట చుక్క చిందించాల్సిన అవసరమే లేకుండా పోయింది. మనిషికి కావాల్సిన ప్రతి వస్తువును కూడా ఉన్నచోటికి తెచ్చి ఇచ్చేందుకు ఎన్నో రకాల కంపెనీలు కూడా సర్వీస్ లు అందిస్తూ ఉన్నాయ్. దీంతో తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే చెప్పుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు జనాలు.

 ఇలా ఆన్లైన్ సర్వీసులపై కాస్త అతిగానే ఆధారపడిపోతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఆన్లైన్ సర్వీసుల కారణంగా ఎంతో మందికి చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెడితే చివరికి ఇంకేదో డెలివరీ కావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆహారం ఆర్డర్ చేసిన సమయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక భారీ ధర పెట్టి ఆహారాన్ని కొనుగోలు చేస్తే నాణ్యత లోపం ఉండటమే కాదు ఆహారంలో.. బొద్దింక బల్లులు లాంటివి కనిపించడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది.

 ఇటీవల  కాలంలో చాలా మంది కూరగాయలు పండ్లను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి కిరాణా డెలివరీ యాప్ అయిన zepto నుంచి ఆన్లైన్లో ఆరెంజ్ పండ్లని ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలోనే తనకు డెలివరీ వచ్చిన తర్వాత ఆ పండ్లను తొక్కలను తీసి ఇక తినడం మొదలు పెట్టాడు. కానీ ఒక్కసారిగా ఏకంగా  ఆ పండు తొనలో బతికి ఉన్న పురుగును చూసి షాక్ లో మునిగిపోయాడు. ఇక ఈ క్రమంలోనే షాక్ అయినా కస్టమర్ జనార్ధన్  అనే వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఈ వీడియోలొ ఆరెంజ్ పండులో కదులుతున్న ఒక పురుగు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: