కేజీ వెల్లుల్లి రూ.500.. దొంగల భయంతో రైతు ఏం చేశాడో తెలుసా?

praveen
ఒకప్పుడు ఎక్కడైనా దొంగలు పడ్డారు అన్న వార్త తెలిసింది అంటే బంగారం, నగదు లేదంటే ఏదైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారేమో అని అనుకునేవారు అందరూ. కానీ ఇటీవల కాలంలో బంగారం లాంటి వస్తువులను సైతం పక్కనపెట్టి.. ఏకంగా మార్కెట్లో భారీ ధర పలుకుతున్న కూరగాయలను ఎత్తుకెళ్లడానికి కూడా దొంగలు ప్రయత్నిస్తున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు టమాటా రేట్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఏకంగా పొలంలో టమాటాలను దొంగలించిన ఘటనలు అందర్నీ అవాక్కయ్యేలా చేశాయ్. ఉల్లిపాయ ధరలు ఎక్కువ ఉన్న సమయంలోను ఇలాంటి ఘటనలు జరిగాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి సమయంలో ఏకంగా టమాటా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు టమాటా పంటకు సెక్యూరిటీ గార్డ్ లను  రైతులు నియమించుకున్న ఘటనలు కూడా అందరిని ఆశ్చర్యపోయేలా చేసాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక రైతు ఇలాంటిదే చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇటీవల కాలంలో వెల్లుల్లి ధర ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కేజీ 500 రూపాయలు పలుకుతుంది. ఈ క్రమంలోనే వెల్లుల్లి పంట వేసిన ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక రైతుల పంట పొలాల్లో వెల్లుల్లి చోరీ జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

 అయితే తాను వేసిన వెల్లుల్లి పంటలో కూడా ఇలాంటి చోరీలు జరిగే అవకాశం ఉంది అని గ్రహించిన ఒక రైతు.. వినూత్నమైన ఆలోచన చేశాడు. పంటను కాపాడుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. మధ్యప్రదేశ్లోని మోహుకేడ్ ప్రాంతంలో పంట సాగు చేసిన రైతు.. పొలాల్లో ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగేలా.. వీటిని సెట్ చేశారు. అయితే ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత వెల్లుల్లి దొంగతనాలు తగ్గిపోయాయి అని రైతులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: