పార్ట్ టైమ్ జాబ్ ఉందని చెప్పాడు.. కానీ చివరికి?
అందుకే ఇటీవలే కాలంలో పార్ట్ టైం జాబ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అదే సమయంలో ఇలాంటి పార్ట్ జాబ్ ఎంతోమంది కేటుగాళ్ళకి కూడా అటు ఆసరాగా మారిపోయింది. పార్ట్ టైం జాబ్ పేరు చెప్పి చివరికి ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఏకంగా అమాయకపు ప్రజలను టార్గెట్ చేస్తూ చివరికి అందిన కాడికి దోచుకోవడానికి కేటుగాళ్లు ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. ఇక ఇలాంటి తరహా సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ళకు బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇస్తున్న బెంగళూరుకు చెందిన మహిళను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన బాధితుడికి పార్ట్ టైం జాబ్ పేరుతో వాట్సాప్ టెలిగ్రామ్ లో లింక్స్ పంపించి విడతలవారీగా అతని దగ్గర నుంచి 5.84 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏకంగా బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇస్తున్న మహిళను అరెస్టు చేశారు.