జీన్స్ ప్యాంట్ కలర్ పోయిందని కేసు వేశాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా దుస్తుల దగ్గర నుంచి చెప్పుల వరకు ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తూనే ఉంటారు. కొంతమంది చిన్న చిన్న షాపులలో కొనుగోలు చేస్తే ఇంకొంతమంది పెద్ద షాపింగ్ మాల్స్ లో భారీ ధర పెట్టి ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా కొనుగోలు చేసిన వస్తువు తమకు నచ్చకపోతే లేదంటే క్వాలిటీ విషయంలో ఏదైనా తేడా వస్తే.. ఇక వెంటనే దానిని సోషల్ మీడియాలో పెట్టడం చేస్తూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఇక తాము కొన్న ప్రోడక్ట్ విషయంలో అసంతృప్తి చెంది ఏకంగా కంపెనీపై ఫిర్యాదు చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తున్న ఘటనలు చాలానే తెరమీదికి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి పిటిషన్ పై విచారణ జరుపుతూ.. వినియోగదారుల కోర్టు ఇక వారికి న్యాయం జరిగేలా తీర్పుని ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల ఒక వ్యక్తి జీన్స్ ప్యాంట్ విషయంలో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తాను ఏకంగా రూ. 4500 పెట్టి జీన్స్ ప్యాంట్ ని కొనుగోలు చేస్తే కేవలం ఐదు ఉతుకుల్లోనే కలర్ పోయింది అంటూ ఆరోపిస్తూ ఇక ఇలా కోర్టును ఆశ్రయించాడు.

 బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఏకంగా బెంగళూరుకు చెందిన హరిహరన్ అనే వ్యక్తి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. రూ. 4,499 రూపాయలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మాల్ లో అతను వ్యాన్ హుస్సేన్ కంపెనీకి చెందిన ఒక జీన్స్ ని కొనుగోలు చేశాడు. అయితే కేవలం ఐదు ఉతుకుల్లోనే ఆ జీన్స్ కలర్ పోయి ఫేడ్ అవ్వడంతో తన డబ్బు తిరిగి చెల్లించాలి అంటూ మాల్ సిబ్బందిని కోరాడు. అయితే వారు నిరాకరించడంతో చివరికి వినియోగదారుల కోర్టులో కేసు కూడా వేశాడు. అయితే అతని పిటిషన్ పై విచారణ జరిపిన అనంతరం బాధితుడికి 4016 రూపాయలతో పాటు అదనంగా వెయ్యి రూపాయలు కూడా చెల్లించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: