5 నెలలుగా రాని గవర్నమెంట్ పింఛన్.. దీంతో ఆ ముసలమ్మ ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పనిచేయడానికి సత్తువ ఉండదు. దీంతో కేవలం గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీదే ఆధారపడి బతికే కుటుంబాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఒకవైపు కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడం తమవల్ల కాదు అని రోడ్డును వదిలేస్తున్న వేళ.. ఇక ఎంతోమంది వృద్ధులు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడుతూ ఇక సర్దుకుపోతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అలాంటిది ఏకంగా గవర్నమెంట్ పింఛను కూడా రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఒక నెల అటూ ఇటూ అయినా పర్వాలేదు. కానీ ఏకంగా ఐదు ఆరు నెలల నుంచి వరుసగా గవర్నమెంట్ నుంచి పింఛన్ అందకపోతే ఇక వృద్ధులు   ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటూ  ఉంటారు. అయితే పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తెలియక.. ఇక పింఛన్ లేకుండా ఎలా బ్రతకాలో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వృద్ధ దంపతులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన పింఛన్ ఆగిపోయింది. దీంతో వారి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టూ ముట్టాయి. మూడు పూటలా గడవడమే కష్టంగా మారిపోయింది.

 ఇక ప్రభుత్వాన్ని ఈ విషయంపై ఎలా ప్రశ్నించాలో వారికి అర్థం కాలేదు. ఈ క్రమంలోనే ఆ వృద్ధురాలు  ఒక వినూతమైన ఆలోచన చేసింది. గత ఐదు నెలలుగా పెన్షన్ పంపిణీలో జాప్యం  జరగడంతో కేరళలోని వండి పెరియార్ సమీపంలో కరుపు పాలెంలో ఉండే 90 ఏళ్ళ వృద్ధురాలు ఆందోళనకు దిగింది  తనకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపింది. దీంతో అటుగా వచ్చే వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే తమ జీవిత ఆధారపడి ఉంది అంటూ ఆ వృద్ధురాలు తన గోడును వెల్లబోసుకుంది. దీంతో ఇక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: