ప్రేమ పెళ్ళి.. యువతి అలా చేసిందని.. 3 రోజులకే వరుడు సూసైడ్?

praveen
ప్రేమ అనేది పలకడానికి వినడానికి ఎంతో చిన్నపదమే. కానీ ఈ రెండక్షరాల పదం వల్ల ఎంతో మంది జీవితాల్లో ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రేమించిన వారు మోసం చేశారని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే.. ఇక ప్రేమను గెలిపించుకోలేకపోయామని ఇంకొంతమంది బలవన్మరణాలకు  పాల్పడుతున్నారు. ఇక ఎంతో కష్టపడి ప్రేమను గెలిపించుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. పరువు హత్యలు కూడా జరుగుతూ దారుణంగా ప్రాణాలు దాల్లో కలిసిపోతున్నాయ్.

 అయితే ప్రేమించడం గొప్ప కాదు ఏకంగా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లడం మాత్రం చాలా గొప్ప అని చెప్పాలి. అయితే ఏకంగా కొన్నెళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన జంట.. పెళ్లితో ఒకటైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇక్కడ ఓ జంట నాలుగేళ్ల పాటు ప్రేమించుకుంది. ఇక ఇటీవల పెళ్లి కూడా చేసుకుంది. కానీ  వారి బంధంలో ఒక విషాదకర ఘటన జరిగింది. పెళ్లైన మూడు రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగలురు తాలూకాలో ఉన్న తెగురు గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 24 ఏళ్ల వినోద్ రాజ్ అనే యువకుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అతను నేషనల్ కబడ్డీ ప్లేయర్ కూడా. అయితే కబడ్డీనే ప్రాణంగా బ్రతుకుతున్న అతని జీవితంలోకి ప్రేమ వచ్చేసింది. 4 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన తనుజ అని యువతిని ప్రేమించాడు. ఇక వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఎన్నో రోజులకు పాటు పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండ పోయింది. ఈ క్రమంలోనే డిసెంబర్లో ఈ జంట పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మూడు రోజులకే తనుజ తాలిని వినోద్ రాజ్ కు ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. నాలుగేళ్లుగా ప్రేమించిన యువతి ఇలా మోసం చేసిందని తీవ్ర మనోవేదనకు గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు వినోద్. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: