సమ్మక్క సారలమ్మకు.. పెంపుడు కుక్క మొక్కు చెల్లించుకున్న కుటుంబం?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఏదో ఒక సమయంలో మొక్కుకోవడం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద కోరికలనే కోరుతూ ఉంటారు. తమ వ్యాపారం వృద్ధి చెందితే ఇక మొక్కు చెల్లిస్తామని కోరుకునే వారు కొంతమంది అయితే.. తమ ఆరోగ్య సమస్య తీరితే తప్పకుండా నీ గుడికి వచ్చి ముక్కును తీర్చుకుంటామూ దేవుడా అని మొక్కుకునేవారు కొంతమంది. అయితే ఇక ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనసులో కోరుకున్న కోరిక తీరింది అంటే చాలు ఇక తాము మొక్కుకున్న మొక్కుని తప్పకుండా తీర్చుకుంటూ ఉంటారు.

 ఇలాంటి మొక్కును తీర్చుకోవడం కోసం కొంతమంది భక్తులు ఏకంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా వెనకడుగు వేయరు అన్న విషయం తెలిసిందే. అది సరే గానీ ఇక దేవుడుకు మొక్కే మొక్కల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఒక కుటుంబం ఏకంగా తమ మొక్కు తీర్చుకోవడానికి  వెళ్ళింది. అవును వెళ్తే తప్పేంటి ఇందులో కొత్తగా ఏమైనా ఉందా అంటారా.. అయితే వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది. ఏకంగా కుక్క కోసం. అదేంటి కుక్క కోసం మొక్కు తీర్చుకోవడం ఏంటీ.. ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా. ఇది నిజంగానే జరిగింది.

 ఇక ప్రస్తుతం సమ్మక్క, సారలమ్మ ను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక కుటుంబం మొక్కు తీర్చుకోడానికి వెళ్ళింది. అయితే వారి కోసం మొక్కిన మొక్కు కాదు ఏకంగా పెంపుడు కుక్క ఆరోగ్యం  కోసం మొక్కిన మొక్కును తీర్చుకోవడానికి వెళ్ళింది ఆ కుటుంబం. హనుమకొండ లోని బిక్షపతి, జ్యోతి దంపతులు పెంపుడు కుక్క గత సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో ఆరోగ్యం కుదుతపడితే నిలువెత్తు బంగార సమర్పిస్తామని మొక్కుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక కుక్క ఆరోగ్యం బాగు కావడంతో వారి మొక్కును తీర్చుకునేందుకు వెళ్లి నిలువెత్తు బంగారాన్ని ఆ దేవతలకు సమర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: