ఫర్ జీ వెబ్ సిరీస్ చూసి.. నకిలీ నోట్లు తయారు చేశారు.. కానీ చివరికి?

praveen
ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం అటు ప్రేక్షకులపై కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే సినిమాల్లో ఉండే మనిషిని గ్రహించడం మానేసి ఇక సినిమాల్లో చూపించే చెడుకే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో చూపించినట్లుగానే నిజ జీవితంలో కూడా ట్రై చేస్తూ ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల హైదరాబాద్ లో కూడా కొంతమంది కేటుగాళ్లు ఇలాంటిదే ప్రయత్నించారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఫర్ జీ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఈ వెబ్ సిరీస్ లో ఒక పేద కుటుంబంలో జన్మించిన షాహిద్ కపూర్ ఏకంగా తనకున్న టాలెంట్ తో నకిలీ నోట్లో తయారు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఏకంగా ఆర్బిఐ తయారు చేసే నోట్లకు ఎక్కడ తేడా లేకుండా నకిలీ నోట్లోను తయారుచేసి చలామణిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కనీసం ఇక మిషిన్ లు సైతం గుర్తుపట్టలేని విధంగా ఇలా నకిలీ నోట్లు తయారు చేయడం ఈ వెబ్ సిరీస్ లో ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. అయితే ఇక పర్ జీ వెబ్ సిరీస్ చూసి ఇక్కడ కొంతమంది కేటుగాళ్లు.. బాగా ప్రభావితం అయ్యారు అన్నది తెలుస్తోంది. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ లో చూపించినట్లుగానే ఏకంగా నకిలీ నోట్లు తయారు చేసేందుకు పూనుకున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో ఇక ఇలా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి నాలుగు లక్షల విలువ గల 500 రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు. వరంగల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా 500 రూపాయలను ప్రింట్ చేస్తున్నారని.. పది అసలు నోట్లు ఇస్తే 40 నకిలీ నోట్లు ఇస్తామని కొందరు వ్యక్తులను సంప్రదిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సైబరాబాద్, బాలానగర్ పోలీసులు అల్లాపూర్ పోలీసులతో ఎంతో చాకచోక్యంగా అనుమానితులను పట్టుకున్నారు. వారిని విచారించి ఏకంగా వారి దగ్గర నాలుగు లక్షల 500 రూపాయల నకిలీ నోట్లనూ సీజ్ చేశారు. అంతే కాదు రెండు ప్రింటర్లు, పేపర్లు, ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు  ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: