ప్రేమ పెళ్లి.. భార్యకు శిరోముండనం చేశాడు?

praveen
సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఎందుకంటే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నేనున్నాను అనే భరోసాని ఇస్తూ ఉండాలి. అయితే ఒకప్పుడు ఇలాంటి బంధాలు కనిపించేవి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల బంధం లో అసలు అన్యోన్యత అనేది కనుమరుగయ్యింది.

 అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు నూటికో కోటికో ఒక్కరు కనిపిస్తున్నారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఏకంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు చివరికి చిన్న చిన్న కారణాలతోనే విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి వస్తుంది. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడటం కాదు ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని చివరికి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకడుగు వేయని దారుణమైన ఘటనలు కూడా నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 అతనికి పెళ్లయింది. సంసారం సాఫీగా సాగిపోతుంది. కానీ ఎందుకో రెండో పెళ్లి చేసుకోవాలని నీచమైన బుద్ధి పుట్టింది. కానీ అందుకు భార్య ఒప్పుకోలేదు. దీంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణంగా ప్రవర్తించాడు భర్త. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పెద్ద కొండేపూడిలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు శిరోమండనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. రెండో పెళ్లి చేసుకున్నందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఇలా హింసిస్తున్నాడని భార్య వాపోయింది. పుట్టింటికి వచ్చినా తనపై దాడి చేశాడని తెలిపింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని మరి ఇలాంటి పనిచేయడం ఏంటి అని అందరూ ఈ విషయం తెలిసి తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: