వీడి బుద్ది పాడుగాను.. పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి మరి?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో చావు తెలివితేటలు అనే పదం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఎదుటివారిని మోసగించి ఏదో ఒక విధంగా లాభం చేకూర్చుకోవాలని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఇక ఇలాంటి ఆలోచననే చావు తెలివితేటలు అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బీమా డబ్బులు కోసం కక్కుర్తి పడి తాము చనిపోయినట్లు నాటకం ఆడటం చేస్తూ ఉన్నారు చాలామంది. సినిమా డైరెక్టర్లను మించిన క్రియేటివిటీతో ఆలోచిస్తూ ఇక బీమా సంస్థలను బురిడీ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి చేసీ కొంత మంది అడ్డంగా దొరికేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి చావు తెలివితేటలతోనే బీమా డబ్బులను కాజేయాలని అనుకున్నాడు. కానీ పథకం బెడిసి కొట్టి చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. కేతమల్ల వెంకటేశ్వరరావు అలియాస్ పుసయ్య  వీరయ్యపాలెంలో ధాన్యం వ్యాపారి. అయితే వివిధ అవసరాలకు తీర్చలేని అప్పులు చేశాడు. దీంతో ఇక ఒక ప్లాన్ వేశాడు. చనిపోయినట్టు చిత్రీకరించుకొని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తే తన పేరిట ఉన్న 40 లక్షల బీమా వస్తుందని అనుకున్నాడు.

 ఇక ప్రమాదవశాత్తు చనిపోయినట్లు అందరిని నమ్మించాడు. అతని స్థానంలో వేరే మృతదేహాన్ని నుంచి ఎవరు గుర్తించకుండా చేయాలని అనుకున్నారు.  గుర్తు తెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరం గ్రామీణ మోరంపూడి కి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో 23న ఓఎన్జిసి ఇంజనీర్ నెల్లి విజయరాజు మరణించారు. ఈ క్రమంలోనే l కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పూడ్చిపెట్టగా ఇక ఇద్దరి యువకులు విషయం తెలుసుకొని పూడ్చి  పెట్టిన శవాన్ని బయటకు తీసి దొంగలించారు. ఇక ప్లాన్ ప్రకారం వీరంపాలెం తీసుకెళ్లి ఒక పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అక్కడ పూసయ్య పాదరక్షలు వదిలి పరారయ్యారు. కానీ ఈ విషయంపై పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అస్సలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: