ఫుల్లుగా మందు కొట్టి.. 108 ఫోన్ చేశాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అనే సమాధానమే చెబుతున్నారు అందరూ. ఎందుకంటే ఒకప్పుడు మద్యం తాగే అలవాటు ఉన్నవాడిని చెడ్డవాడిగా ముద్ర వేసి అందరూ అలాగే చూసేవారు. కానీ ఇటీవల కాలంలో స్నేహితులందరూ పార్టీ చేసుకుంటున్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి మద్యం తాగకుండా కేవలం కూల్ డ్రింక్ తాగుతూ ఉండిపోయాడు అంటే చాలు అతన్ని విచిత్రంగా చూడటం చేస్తూ ఉన్నారు.

 అయితే మద్యం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎందుకో ఈ అలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటికి కూడా మద్యానికి కొంతమంది బానిసైన కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే ఒక్క పెగ్గు లోపలికి వెళ్ళింది అంటే చాలు మందు బాబులు కొంతమంది చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏకంగా కొన్ని కొన్ని సార్లు ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి చేసిన పని కాస్త అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.

 సాధారణంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అటు అంబులెన్స్ కి ఫోన్ చేయడం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఫుల్లుగా మద్యం సేవించిన రమేష్ అనే వ్యక్తి 108 అంబులెన్స్ కి అర్ధరాత్రి కాల్ చేసి హల్చల్ చేశాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుండి జనగాం కు వెళ్లాలి నడవలేకపోతున్న.. బస్సులు కూడా లేవు. నన్ను జనగాంలో దింపండి అంటూ అంబులెన్స్ సిబ్బందిని వేడుకున్నాడు రమేష్. అతని వాదన విని షాక్ అయిన సిబ్బంది.. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే అంబులెన్స్ కి ఫోన్ చేయాలి అంటూ చెప్పగా.. తనకు అత్యవసరం ఉందని స్పృహ తప్పి పడిపోయేలా ఉన్నాను అంటూ అతను వారితో వాదించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: