వారికి ముగ్గురు ఆడపిల్లలే.. మగపిల్లాడి కోసం ఏం చేశారో తెలుసా?

praveen
ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు ఇంకా భారంగానే భావిస్తున్నారా అంటే నేటి రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లను భారంగా భావించిన తల్లిదండ్రులు.. ఇక ఇప్పుడు ఏకంగా తమకు ఆడపిల్ల పుడితే బాగుండు అని పూజలు పునస్కారాలు చేస్తు ఉండడం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది మగపిల్లల్లో ఉన్న వారు కూడా ఆడపిల్ల కోసం ఎన్నో నోములు నోస్తున్న వారిని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటికి కూడా ఆడపిల్ల వద్దనుకొని మగపిల్లాడు కావాలనుకునే జనాలు అక్కడక్కడ ఉన్నారు అన్న దానికి నిదర్శనం గా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయ్.

 ఏకంగా ప్రతి కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో మగపిల్లాడి కోసం కొంతమంది చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. అంబర్ పేటలో నివాసం ఉంటున్న వెంకన్న, కవిత అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ప్రతి కాన్పులో మగపిల్లాడు పుడతాడు అని ఆశపడిన వారి ఆశ తీరలేదు. అయితే మగపిడిల్లాడు కావాలని ఆ దంపతులు అనుకున్నారు. దీంతో ఏం చేయాలో వారికి పాలు పోలేదు. ఈ క్రమంలోనే ఒక చెత్త ఆలోచన వారి మనసులో తట్టింది. ఎలాగైనా మగపిల్లాడు కావాలి అని ఆలోచించిన ఆ దంపతులు ఇతరులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 హైదరాబాద్లోని పాతబస్తీ లో ఉన్న మెటాలిటీ ఆసుపత్రి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల శివ కుమార్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేశారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోయారు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే బాలుడిని అపహరించి వారిని పట్టుకున్నారు. ఇక బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: