జనాలు ఇలా తయారయ్యారేంటి.. ఈ కారణంతో కూడా విడాకులు అడుగుతారా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఒంటరిగా ఏకాకిలా సాగిపోతున్న జీవితానికి ఒక తోడును ఇచ్చేది పెళ్లి అనే బంధం. అయితే ఇలామూడుముళ్ల బంధంతో ముడి పడిన బంధం ఎప్పటికీ కూడా విడిపోదు అని చెప్పేవారు పెద్దలు. ఇక మనిషి జీవితంలో ఉండే అన్ని బంధాల కంటే దాంపత్య బంధమే ఎంతో గొప్పది అని అనేవారు. ఎందుకంటే ఇక ఇలా తోడునీడగా పెళ్లి అనే బంధంతో వచ్చిన భాగస్వామి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉంటుంది అనేవారు పెద్దలు. అయితే ఒకప్పుడు ఎంతోమంది ఇలా దాంపత్య బంధానికి విలువ ఇచ్చేవారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా విడిపోవాలి అనే ఆలోచన మాత్రం చేసేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మనుషుల ఆలోచన తీరులో పూర్తిగా మార్పు వచ్చేసింది.

 ఏకంగా పెళ్లి అనే బంధాన్ని కమర్షియల్ గా మార్చేస్తూ ఉన్నారు ఎంతోమంది. అయితే ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఎవరు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కాస్తైన ప్రయత్నించడం లేదు. చిన్న చిన్న కారణాలతో చివరికి విడాకులు తీసుకుని వేరుపడడానికి ఎంతో మంది సిద్ధపడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత చిన్న కారణానికి పచ్చటి కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటారా అని అనుకుంటూ ఉన్నారు ఇలాంటి విడాకుల విషయం గురించి తెలిసిన జనాలు.

 ఇలా ఇటీవల కాలంలో విచిత్రమైన కారణాలతో విడాకులు కోరడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఆగ్రాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అత్తగారు తన మేకప్ కిట్ ను వాడేసారు అన్న కారణంతో భర్త నుంచి విడాకులు కోరింది ఒక భార్య. ఏదైనా ఈవెంట్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు అత్తగారు తన మేకప్ కిట్ ఉపయోగిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. అయితే దీనిపై ఇద్దరికీ కూడా గొడవ జరగడంతో భర్త కోపంతో భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఇక వీరి మధ్య దూరం మరింత పెరిగి విడాకులు తీసుకునే వరకు వచ్చింది అని పోలీసులు తెలిపారు. అయితే ఈ విచిత్రమైన కారణం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: