రూ.500 కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణానికి కారణమైంది?

praveen
నేటి ఆధునిక సమాజం లో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక ప్రతి విషయం లో కూడా ఎంతో గొప్పగా ఆలోచించ గలుగుతున్నాడు మనిషి. దీంతో ఇక ప్రతి విషయాన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని సులభతరం చేసుకో గలుగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అయితే ఇదంతా మాటల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక చేతల విషయానికి వస్తే మాత్రం నేటి ఆధునిక సమాజం లో మనిషి లో విచక్షణ జ్ఞానం అనేది రోజు రోజుకీ పూర్తిగా తగ్గి పోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యం గా నిలబడి ఎదుర్కొనే వాడు మనిషి. కానీ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకే అక్కడితో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ చివరికి  చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని మనిషి చేజేతులారా అర్ధాంతరంగా ముగించుకుంటున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా మనిషి ఆలోచన తీరు పూర్తిగా మారి పోయింది అని చెప్పాలి. ఇలా క్షణికావేషం లో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి.

 ఇక ఇటీవల ఏపీలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటనే వెలుగు లోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా చివరికి క్షణికావేశం లో భార్యా భర్తలు ఇద్దరు కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో దంపతులు రాంబాబు కనకదుర్గ నివాసముంటున్నారు. అయితే ఇద్దరి మధ్య 500 కోసం వివాదం మొదలైంది. దీంతో తొలుత భర్త మనస్థాపంతో ఉరి వేసుకోగా.. ఇక ఆ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: