స్నేహితున్ని చంపేశారు.. కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు?

praveen
నేటి సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలు. అయితే ఈ విషయాన్ని చెబుతుంది ఎవరో కాదు ఏకంగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే.. ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయ్. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవాడు మనిషి.. కుదిరితే సహాయం కూడా చేసేవాడు. కానీ ఇటీవల కాలంలో సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ అనేది కనిపించడం లేదు. సాటి మనుషులు ఏకంగా ఆస్తుల కోసం కొంతమంది తోబుట్టువులనే హత్య చేస్తుంటే.. చిన్న చిన్న కారణాలతో ఇంకొంతమంది స్నేహితులను చంపేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు.

 ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న హత్యలకు సంబంధించిన ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. కనీసం కంటిమీద కునుకు  లేకుండా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక ఈ ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ప్రతి మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పది అని అంటూ ఉంటారు. కానీ అలాంటి స్నేహబంధమే ఇక్కడ చివరికి ప్రాణాలను గాల్లో కలిపేసింది.

 ఆన్లైన్ గేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదు అన్న కారణంతో నలుగురు స్నేహితులు ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. పశ్చిమ బెంగాల్లో దాస్ అనే 18 ఏళ్ల విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. అయితే అతడు తన స్నేహితులకు మొబైల్ పాస్వర్డ్ షేర్ చేయలేదని తెలిసింది. దీంతో అగ్రహానికి గురైన నలుగురు స్నేహితులు దాస్ ను దారుణంగా కొట్టి చంపారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: