యాక్.. ఫుడ్ ఆర్డర్ చేసాడు.. అందులో ఏమొచ్చిందో తెలుసా?

praveen
సాధారణంగా ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడు రొటీన్ ఇంట్లో ఆహారాన్ని తినడానికి అసలు ఇష్టపడరు. ఈ క్రమంలోనే ఏదైనా స్పెషల్ డే ఉంది అంటే చాలు దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లి కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇంకొందరు రెస్టారెంట్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే ఇక ఆన్లైన్లో కావాల్సిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇక ఇంటికి తెప్పించుకొని మరి తినడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హోటల్స్ లో నాణ్యతలేని ఆహారం ఎంత దారుణంగా ఉందో అన్నదానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇక హోటల్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయపడిపోతున్నారు అందరూ.

 బిర్యానీలో బొద్దింకలు కర్రీస్ లో చనిపోయిన ఎలుకలు, బల్లులు యాక్ ఇలా చెప్పుకుంటుంటేనే కడుపులో తిప్పేస్తుంది కదా.. కానీ ఇలాంటి ఘటనలు రెస్టారెంట్లలో నిజంగానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు జరిపి వార్నింగ్లు వచ్చిన కొన్ని రెస్టారెంట్ల తీరులో మాత్రం అసలు మార్పు రావట్లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండడంతో ఏదైనా రెస్టారెంట్ నుంచి కావాల్సిన ఫుడ్ తెచ్చుకోవాలి అంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫుడ్ లో ఎక్కడ చనిపోయిన బొద్దింక, ఎలుక, బల్లి లాంటివి చూడాల్సి వస్తుందో అని.

 అయితే ఇటీవలే ఇలాంటి తరహా ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆహారంలో చచ్చిన ఎలుక బొద్దింక రావడంతో కష్టమర్లు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ప్రయాగ్ రాజ్ కు చెందిన రాజీవ్ శుక్ల అనే వ్యక్తికి ముంబైలో ఈ చేదు అనుభవం ఎదురైంది. శాకాహారి అయిన అతను బార్బెక్యూ నేషన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ అయిన తర్వాత అతను తింటుండగా ఏకంగా ఆహారంలో చనిపోయిన ఎలుక, బొద్దింక వచ్చాయి  దీంతో అతను ఫుడ్ పాయిజన్ తో మూడు రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: