గాలిపటం ఎగరవేశాడు.. చివరికి ప్రాణం పోయింది.. ఏమైందంటే?

praveen
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఊరువాడ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, పిండి వంటలు, కోళ్ల పందాలు, డీజే డాన్సులు సాంప్రదాయ వస్త్రధారణలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగకు ఉండే హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 ఇలా తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా భావించే సంక్రాంతిని ప్రతి ఒక్కరూ కూడా సంబరాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇటీవలే కాలంలో మాత్రం సంక్రాంతి పండుగ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపే పండుగ మారిపోయింది అని చెప్పాలి. దీనికంతటికి కారణం చైనా మంజా. చైనా మాంజా వాడొద్దని అధికారులు ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జనాలు మాత్రం గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా వాడుతున్నారు. చివరికి ఆ చైనా మంజ రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల మెడకు చుట్టుకుని చివరికి యమపాశం గా మారి పోతుంది అని చెప్పాలి.

 అదే చైనా మంజాతో ఎన్నో పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే కేవలం చైనా మాంజ  మాత్రమే కాదు మరో విధం గా కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎత్తయిన బిల్డింగ్లపై గాలి పటాలు ఎగరవేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయం లోనే కొంతమంది ప్రాణాలను తెచ్చుకుంటారు. ఇటీవలే హైదరాబాద్లోనీ ఎల్బీ నగర్ పరిధి నాగోల్ లో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ నాలుగో అంతస్తు పై నుండి పడి శివ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లి దండ్రులు శోకంలో మునిగి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: