దారుణం : శబరిమలలో అయ్యప్ప భక్తుడిపై.. పిడిగుద్దులు కురిపించిన పోలీస్?

praveen
కేరళలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం ఇక దేశవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతిగాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. అయితే ఇక దేశ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామి దీక్ష పూనుతూ దాదాపు 40 రోజులపాటు ఇక నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ప్రతి ఏటా ఇక శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తుల తాకిడి పెరుగుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాలను గంట పాటు పెంచుతూ ట్రావెన్ కోర్ కూడా నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు ఇక స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే మండల దీక్ష తీసుకున్న భక్తులు శాస్తా దర్శనం కోసం పత్తినట్టంపాడి ఎక్కాల్సి ఉంటుంది. అయ్యప్ప భక్తులందరూ కూడా 18 పవిత్రమైన మెట్లు ఎక్కుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు తోపులాట కూడా జరుగుతూ ఉంటుంది.

 ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అక్కడ భారీగా పోలీసుల బందోబస్తు కూడా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా పతినట్టెంపాడి ఎక్కుతూ ఉండగా పోలీసు తనను కొట్టాడు అంటూ బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఎస్ రాజేష్ అనే భక్తుడు శబరిమల అయ్యప్ప సన్నిధానం కు చేరుకున్నాడు. అయితే ఇటీవల పతినేట్టంపాడి ఎక్కుతున్న సమయంలో పోలీసులు తలను కొట్టారు అంటూ రాజేష్ తెలిపాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తాము మెట్లు నెమ్మదిగా ఎక్కుతున్న సమయంలో పోలీసు నాలుగో మెట్టు మీదికి రాగానే చేతితో పిడుగులు కురిపించాడని.. తాను నొప్పితో కేకులు వేస్తూనే పిల్లవాడిని మరింత దగ్గరకు తీసుకొని వేగంగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు రాజేష్. ఈ విషయంపై స్పందించిన ట్రావెన్ కోర్  దేవసోమ్ బోర్డు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: