విధి ఆడిన నాటకం.. అన్నని బస్సు ఎక్కించి.. అదే బస్సు కింద పడిన చెల్లి?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారిసిన వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజమే విధి చేతిలో మనుషుల జీవితాలు కీలుబొమ్మలే అని నమ్మకుండా అసలు ఉండలేరు. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఇక అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు విధి కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 దీంతో అప్పటివరకు కళ్ళ ముందు సంతోషంగా ఆడుకున్న చిన్నారులు అంతలోనే అనూహ్య ఘటనలతో కానరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో అల్లారూ ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లితండ్రులు అరణ్య రోదనలో మునిగి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే విధికి కాస్తయినా జాలి లేదా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఏకంగా అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు అమ్మమ్మతో కలిసి వెళ్లిన చిన్నారి.. చివరికి అదే స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో వెలుగులోకి వచ్చింది.

జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు రోజువారి మాదిరిగానే పిల్లలను ఎక్కించుకోవడానికి రవీంద్ర నగర్ కు వెళ్ళింది. అక్కడ ఒక చిన్నారి తన అన్నను బస్సు ఎక్కించడానికి అమ్మమ్మతో కలిసి వచ్చింది. అయితే పాప తండ్రి బాబుని బస్సు ఎక్కిస్తుండగా.. పాప అమ్మమ్మ నుంచి విడిపించుకుని బస్సు ముందుకు వచ్చింది. అది ఎవరు గమనించకపోవడంతో బస్సు డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దాంతో పాప బస్సు కింద పడిపోయింది అని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: