డెలివరీ బాయ్ ముందే పార్సిల్ ఓపెన్.. ఫోన్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందంటే?

praveen
ఇటీవల కాలంలో పెరిగిపోయిన టెక్నాలజీ అటు మనిషి జీవితంలోని ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం చేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఆహారం తినే దగ్గర నుంచి ఇక వస్తువులు కొనుక్కునే వరకు ప్రతి పని ఎంతో ఈజీగా మారిపోయింది. అయితే ఒకప్పుడు ఏది కావాలన్నా బయట ఎక్కడకో దుకాణం కు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దృశ్య చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు కావాల్సినవన్నీ కూడా ఇంటి ముంగిటికీ వాలిపోతున్నాయి.

 దీంతో ఏం కొనుగోలు చేయాలన్నా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తినే ఆహారం దగ్గర నుంచి ఇక ప్రతిరోజు వాడే మొబైల్ వరకు కూడా అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్  పెట్టడానికి అలవాటు పడిపోయారు జనాలు. ఇక ఎన్నో కంపెనీలు కూడా ఇలాంటి సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఆన్లైన్ పై అతిగా ఆధారపడితే చివరికి చేదు అనుభవాలు తప్పవు అని నిరూపించే ఘటనలు కొన్ని కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే భారీ ధర పెట్టి ఆన్లైన్లో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఇక డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే షాక్ తగులుతూ ఉంటుంది.

 ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి రావడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా రూ. 27,000 పెట్టి ఒక ఫోన్ ఆర్డర్ చేశాడు వ్యక్తి. ఇక డెలివరీ బాయ్ సదరూ పార్సిల్ తీసుకొని యువకుడి దగ్గరికి వస్తాడు. అయితే అనుమానం వచ్చిన కస్టమర్ డెలివరీ బాయ్ తోనే పార్సల్ ఓపెన్ చేయిస్తాడు. అయితే అందులో పది రూపాయల విలువైన సోప్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి అని డెలివరీ బాయ్ ని నిలదీస్తే.. అందుకు అతను నాకేం తెలియదు ఇది కంపెనీని సంప్రదించి ఫిర్యాదు చేయండి సలహా ఇస్తాడు. ఇక ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: