అమ్మాయే అమ్మాయిని ప్రేమించి.. అంతం చేసి?

Chakravarthi Kalyan
ఓ యువతి తన శరీరంలో ఏర్పడిన అసహజ మార్పులతో అతడిగా మారింది. ఆనక తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడింది. ఆమె (స్నేహితురాలు) తిరస్కరించింది. దీనిని భరించలేని అతడు తన స్నేహితురాలిని చిత్ర హింసలకు గురి చేసి సజీవ దహనం చేశాడు. తమిళనాడులోని మధురై జిల్లా వడివేల్ నగర్ కు చెందిన నందిని(25) చెన్నై దురైపాక్కంలో బంధువుల్లో ఇంట్లో ఉంటూ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.


ఆ యువతి చిన్ననాటి స్నేహితురాలైన పాండి మురుగేశ్వరితో కలిసి గతంలో ఒకే స్కూలులో చదువుకుంది. అయితే 2019లో మురుగేశ్వరి లో మగ లక్షణాలు కనిపించాయి. అబ్బాయిగా మారి తన పేరును వెట్రిమారన్ గా మార్చుకుంది. దీంతో ఎవరూ ఆదరించడం లేదు. దాంతో అయ్యో పాపమని తనతో సానుభూతితో మాట్లాడింది. ఎంకామ్ చదివిన వెట్రిమారన్ కూడా నగరంలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఇటీవల నందినిని ప్రేమిస్తున్నాని వెట్రిమారిన్ తెలిపాడు.


అతడి గురించి పూర్తిగా తెలిసిన నందిని ప్రేమను తిరస్కరించింది. అయితే ఆమె మరో యువకుడితో ప్రేమలో పడింది. దీంతో వెట్రిమారన్  ఆమెపై కక్ష పెంచుకున్నాడు. కానీ నందిని తనతోనే మాట్లాడాలి అని తనతోనే ఉండాలని బలవంతపెట్టేవాడు. ఇతర స్నేహితులతో మాట్లాడితే అస్సలు నచ్చేది కాదు. దాంతో నందిని అతడిని దూరం పెట్టి చెన్నైలోని బంధువుల ఇంటికి మకాం మార్చింది.


నందిని తనను పట్టించుకోవడం లేదని భావించి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.  డిసెంబరు 24న ఆమె పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ చేస్తానని వెట్రిమారిన్ బయటకు తీసుకెళ్లాడు. ముందుగా అనాథాశ్రమానికి తీసుకెళ్లి విరాళం ఇచ్చాడు.  ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టాడు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి బ్లేడుతో విచక్షణారహితంగా మెడపై, ఛాతిపై, ఒళ్లంతా దాడి చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. యువతి హాహాకారాలు విన్న చుట్టుపక్కల జనం వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు.  నందిని మరణ వాంగ్మూలంలో వెట్రిమారన్ గురించి చెప్పడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. నందిని మృత దేహాన్ని ఆమె పుట్టిన రోజు నాడే కుటుంబానికి అప్పగించడంతో కుటుంబ సభ్యుల రోదన చూసిన వారి హృదయం ద్రవించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: