మద్యం మత్తులో ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పనికి అందరూ షాక్?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని సాటి మనుషులకు ఏదైనా ప్రమాదం ఏర్పడితేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవారు మనుషులు. కానీ ఇటీవల కాలంలో ఏకంగా సొంత వారి విషయంలో కూడా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు వెనుక ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి.. దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడిన చేస్తూ ఉన్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జులు గ్రామానికి చెందిన బానోవత్ సురేష్ అనే 27 ఏళ్ల యువకుడు తండ్రి వసంతరావు చేతిలో దారుణంగా హతమయ్యాడు. కొడుకు సురేష్ పై కత్తితో దాడి చేసిన తండ్రి ఇక ప్రాణాలు తీసేశాడు  అయితే ఏకంగా కన్న తండ్రి కొడుకును చంపడానికి కారణం కొడుకు మద్యానికి బానిసగా మారి ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తూ ఉండడమే అన్నది తెలుస్తుంది.


 పనికి వెళ్లడం మానేసి తరచూ తాగుతూ ఇక కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు సురేష్. ఇక ఇక ఇటీవల మరోసారి మద్యం మత్తులో వచ్చి గొడవ పడటం మొదలుపెట్టాడు  అయితే ఈ గొడవ పెద్దది కావడంతో.. సురేష్ తండ్రి వసంతరావు కొడుకును కోపంతో కత్తితో పొడిచి హత మార్చాడు. అనంతరం తన కుమారుడిని చంపాననే బాధతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. ఇది చూసిన ఇరుగు పొరుగువారు వసంతరావును హాస్పిటల్కు తరలించారు. ఇక అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కామారెడ్డికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అతను కూడా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: