అత్యాచారం తర్వాత పెళ్లి చేసుకున్నా.. కేసు కొట్టేయలేం : కోర్టు

praveen
ఇటీవల కాలంలో దేశం లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు. అయితే ఆడ పిల్లలను వేధింపులకు గురి చేసిన వారిని శిక్షించేందుకు అటు కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఎక్కడ కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల ఎక్కడైనా ఒంటరిగా కనిపించింది అంటే చాలు మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా కామపు కోరలతో హింసిస్తున్నారు. దీంతో సభ్య సమాజంలో మహిళా సాధికారత వైపుగా అడుగులు వేస్తున్న ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి ఘటనలతో వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

 ఇటీవల కాలంలో ఇలా మహిళలను వేధింపులకు గురిచేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు అటు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితులు.. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పెళ్లి అనే సాకును వాడుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం ద్వారా ఇక అత్యాచారం చేసిన కేసు కొట్టివేస్తారు అనే ఆలోచనతో ఇలాంటి పని చేస్తున్నారు. అయితే ఇలా నిందితులు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలను చేసింది.

 ఒక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. అత్యాచార బాధితురాలని సెటిల్మెంట్ లో భాగంగా నేరస్తుడు పెళ్లి చేసుకున్నప్పటికీ అతనిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయలేము అంటూ స్పష్టం చేసింది కోర్టు. పదహారేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగింది. ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకే నిందితుడిపై కేసు నమోదయింది. అయితే ఆ జంట పెళ్లి చేసుకున్నప్పటికీ గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేము అంటూ కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్  టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: