ఆడుకుంటూ రోడ్డు మీదికి వచ్చిన చిన్నారి.. తర్వాత ఏమైందో చూడండి?
ఇలాంటి సమయంలోనే ఏకంగా పిల్లలు కొన్ని కొన్ని సార్లు రోడ్డుమీదికి వెళ్లి ప్రమాదం బారిన పడటం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే చిన్నపిల్లలు ఎలా ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు ప్రమాదం బారిన పడతారో అన్నదానికి సంబంధించి ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో ఒకటి నిదర్శనంగా మారిపోయింది. ఏకంగా ఏడాదిన్నర వయస్సున్న ఒక చిన్న పిల్లాడు నడుచుకుంటూ హైవే రోడ్డు మీదకి వచ్చేసాడు. కొద్దిలో రోడ్డు ప్రమాదం బారిన పడేవాడు. కానీ అదృష్టవశాత్తు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డు కావడంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టాభిలో ఈ ఘటన జరిగింది. ఏడాదిన్నర వయసు వచ్చిన చిన్నారి తనంతట తాను ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్ళాడు. చిన్నారి బయటకు వెళ్లడం బహుశా తల్లిదండ్రులు గమనించలేదు. అయితే చిన్నారి రోడ్డుపైకి వెళ్లకుండా ఉండేందుకు ఇంటి చుట్టు ప్రహరీ కూడా లేనట్లుగా తెలుస్తుంది. చేతిలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. అయితే రోడ్డుపై వాహనాలు వెళ్తుండడంతో ఆకర్షితుడై ఇక రోడ్డుమీదకి వెళ్ళాడు. ఇంతలోనే కార్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఆ చిన్నారిని చూసి వెంటనే కారుని రివర్స్ చేశాడు. ఇక అక్కడే వదిలేసి వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని గమనించి ఆ చిన్నారిని తీసుకెళ్లి ఇంట్లో దింపాడు. ఇక ఇది చూసి చాలామంది చిన్నారుల పేరెంట్స్ అప్రమత్తమవుతున్నారు అని చెప్పాలి.