భర్తను అమ్మేసిన భార్య.. ఎన్ని లక్షలకో తెలుసు?

praveen
సాధారణంగా మూడుముళ్ల బంధంతో ఒకటైన తర్వాత భార్యాభర్తలు  కూడా అన్యోన్యంగా ఉండాలి. అయితే భార్య విషయంలో పరాయి మగాడు ఏదైనా తప్పుగా మాట్లాడితే భర్త అస్సలు ఊరుకోడు. ఏకంగా అతనికి బుద్ధి చెబుతాడు. అచ్చం ఇలాగే భార్య కూడా భర్త పై పరాయి ఆడదాని కన్ను పడింది అంటే అసలు సహించదు. ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన భర్త తనకే సొంతం అని అనుకుంటూ ఉంటుంది ప్రతి భార్య. అందుకే భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసినా కూడా భార్య గుండె బద్దలైనంత పని అవుతూ ఉంటుంది.



 కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరోలా ఉంది. ఏకంగా కట్టుకున్న భర్తనే మరో మహిళకు అమ్మేసేందుకు సిద్ధమైంది భార్య. ఏకంగా భర్తను ఐదు లక్షలకు అంగట్లో బొమ్మలాగా బేరం పెట్టేసింది. ఆ భర్త కట్టిన తాళికి కూడా కనీస విలువ ఇవ్వలేదు. ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ తన భర్తను ప్రేమించిన మహిళకు ఏకంగా కోటి రూపాయలకు విక్రయిస్తుంది. ఇక అచ్చంగా ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే జరిగింది. కర్ణాటకలో మండ్యా సమీప గ్రామంలో ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని గృహిణి గుర్తించింది.


 ఈ క్రమంలోనే ఓ రోజు ప్లాన్ ప్రకారం ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇక ఇతరు పడకపై ఏకాంతంగా ఉన్నప్పుడు నేరుగా భార్య వారిని పట్టుకుని నిలదీసింది  అయితే ఆడవాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవ చివరికి పంచాయతీ వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే.. నీ భర్త నా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించి నీ భర్తను తీసుకువెళ్ళు అంటూ సదరు వ్యక్తి భార్యకు మరో మహిళ తేల్చి చెప్పింది. అయితే అలాంటి భర్త నాకు వద్దు.. నాకే ఐదు లక్షలు మనోవర్తి ఇచ్చి అతన్ని నువ్వే ఉంచుకో అంటూ భార్య చెప్పేసింది. అయితే ఈ ఐదు లక్షలు ఇచ్చేందుకు తనకు నెల రోజుల సమయం కావాలని భర్త ప్రియురాలు తెలిపింది. అందుకు గృహిణి కూడా అంగీకరించింది. అయితే ఈ ఇద్దరు రాసుకున్న ఒప్పంద పత్రం చూసి పంచాయతీ పెద్దలు సైతం ముక్కున వేలేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: