మటన్ కత్తితో భార్యను నరికిన భర్త.. కారణమేంటో తెలుసా?

praveen
పెళ్లి అనేది కొన్నాళ్లే బాగుంటుందా ఆ తర్వాత ప్రతి ఒక్కరు నరకం అనుభవించక తప్పదా.. పెళ్ళి చేసుకున్న పాపానికి భర్త చేతిలో భార్య.. లేకపోతే భార్య చేతిలో భర్త దారుణంగా హత్యకు గురికావడమె జరుగుతుందా.. ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు.. పెళ్లి చేసుకొని ప్రమాదంలో పడటం ఎందుకు.. ప్రస్తుతం నేటి యువత ఇలాగే ఆలోచిస్తున్నారు. కారణం వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఏకంగా పెళ్లయిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ అన్యోన్యంగా జీవితాన్ని గడపాల్సిన భార్యాభర్తలు బద్ధ శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.


 ఈ క్రమంలోనే కట్టుకున్న వారికి కడవరకు తోడుంటాము అని ప్రమాణం చేసిన వారే చివరికి దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా భార్యను దారుణంగా కొట్టిన కిరాతకమైన భర్త చివరికి ప్రాణాలను గాల్లో కలిపేసాడు. కోలూరు జిల్లా శ్రీనివాసపురం పట్టణంలో మటన్ దుకాణం పెట్టుకున్నాడు నగేష్. అతను ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య రాధ బతికే ఉంది. అయితే మొదటి భార్య బతికుండగానే నగేష్ రెండో పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. అయితే ఇటీవలే మొదటి భార్య తన స్వగ్రామమైన నంబహల్లి గ్రామంలో ఒక దుకాణం పెట్టుకుని టైలర్ పని చేస్తూ జీవన సాగిస్తుంది.


 అయితే రెండో పెళ్లి చేసుకున్న నగేష్ కుటుంబ పోషణతో పాటు పిల్లల గురించిపూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంది రాధా. ఈ విషయాన్ని నగేష్ కు చెప్పింది. అయితే విడాకులు ఇస్తానని మొదటి భార్య చెప్పడంతో కోపంతో రగిలిపోయిన నగేష్.. చివరికి మటన్ షాప్ లో ఉండే కత్తితో భార్యపై దాడి చేశాడు. అడ్డు వచ్చినందుకు  వచ్చిన మామ మునిరాజుపై కూడా దారుణంగా కత్తితో దాడి చేశాడు. రాదను నరికి చంపిన నగేష్ పై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని.. నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: