నెలరోజుల పాటు కలిసున్న లవర్స్.. కానీ కోర్టులో అన్నతో సమానమని చెప్పింది.. చివరికి?
ఇక్కడ ఒక ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంటి నుంచి పారిపోయారు. దాదాపు ఒక నెలపాటు వారిద్దరు కలిసి ఉన్నారు. అయితే తండ్రి కూతురు మిస్సింగ్ అంటూ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరిని గుర్తించి పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రియురాలు.. కోర్టు ముందేంటి ఎవరి ముందైనా సరే నేనంటే ప్రాణం.. అతను లేకుండా బ్రతకలేను అని చెబుతుంది అని ప్రియుడు అనుకున్నాడు. కానీ ఆమె ఇచ్చిన షాక్ కి బిత్తర పోయాడు.
ఇంతకీ కోర్టులో ఆ యువతి ఏం చెప్పిందో తెలుసా.. అతను నాకు ప్రియుడెంటి అతను నాకు సోదరులాంటి వాడు. నేను అతనిని ఎప్పుడు ప్రేమించలేదు.. పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ కోర్టులో చెప్పింది ప్రియురాలు. ఆమె మాటలకు పాకైన ప్రియుడు మనస్థాపంతో కోర్టు ఆవరణలోనే చేయి కోసుకున్న ఘటన కేరళ హైకోర్టులో వెలుగు చూసింది. త్రిసూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ళ విష్ణు అదే జిల్లాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు ఇక ఇంటి నుంచి పారిపోయి ఒకే చోట నెల రోజులపాటు ఉన్నారు. తండ్రి ఫిర్యాదుతో వారిని గుర్తించి పట్టుకుని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. విష్ణుని తాను పెళ్లి చేసుకోలేదని అతను నా సోదరులాంటివాడు అంటూ విష్ణు ప్రియురాలు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. బెదిరించడం వల్ల నెల రోజులపాటు అతనితో ఉన్నాను అంటూ చెప్పింది. దీంతో షాక్ అయిన విష్ణు ఇక కోర్టు ఆవరణలోనే చేయి కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతని ఆస్పత్రికి తరలించారు.