యాక్సిడెంట్ జరగడమే మంచిదయింది.. ఎన్నో ప్రాణాలు నిలిచాయి?
ఊరుకోండి బాసూ.. రోడ్డు ప్రమాదాల విషయం లో కూడా జోకులా.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోతాయి కానీ యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలను నిలవడం ఏంటి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఇదే జరిగింది. వేగం గా దూసుకు వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టడం తో ప్రయాణికులు ప్రాణాల తో బయటపడ గలిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి తెలంగాణ రహదారిలో జరిగింది. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు మునుగోడుకు బయలుదేరింది. ఇలాంటి సమయంలోనే పల్నాడు జిల్లాలో బస్సు వేగంగా వెళుతుండగా ఒకసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
బస్సును ఆపడం డ్రైవర్ కు సాధ్యపడలేదు. ప్రయాణికులంతా ఆహాకారాలు చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఇంతలోనే దేవుడే పంపించాడేమో అన్నట్లుగా ఒక భారీ లారీ ఆ బస్సుకు అడ్డు వచ్చింది. ఆ లారీని ఢీ కొట్టిన బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు అందరూ కూడా స్వల్ప గాయాలుతో బయటపడగలిగారు. లారీ నరసారావుపేట వైపు వెళ్తుండగా పట్లూరి పాలెం ఉప్పలపాడు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయిన ఆ బస్సును లారీ ఢీకొట్టకుండా ఉండి ఉంటే ముందుకు దూసుకు వెళ్లి ఘోర ప్రమాదం జరిగేది. ఎన్నో ప్రాణాలు పోయేవి అని చెప్పాలి.