ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్ట్ అయింది.. కానీ చివరికి సూసైడ్?
మరికొన్ని రోజుల్లో కేరళలోని సిఐడి విభాగంలో ఆ యువతి చేరాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.ఏకంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఈ ఘటన రాజస్థాన్లోని హనుమాన్ఘాట్ లో జరిగింది. ప్రియాంక అనేది అమ్మాయి బాలికల హాస్టల్ లో ఉంటూ యూపీఎస్సీ కి ప్రిపేర్ అవుతుంది. చిన్నప్పటి నుండి చదువుపై మక్కువ ఉన్న ఈ అమ్మాయి మొదటి ప్రయత్నంలోనే మూడు ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇక మరికొన్ని రోజుల్లో తిరువనంతపురం వెళ్లి సిఐడిలో చేరాల్సి ఉంది. కానీ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది.
ఆమె సడన్గా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికి అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని.. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి అసలు నిజాలు బయటపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ కావాలి అనే పట్టుదలతో ఆమె హాస్టల్లో ఉండి చదువుకుంటుందని.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదని.. తండ్రి శివకరణ్ బోరున విలపించాడు.