ఆ వయస్సు భార్యతో శృంగారం చేస్తే.. 15 ఏళ్ళ జైలు శిక్ష?
అంతేకాదు అటు తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అనుకుంటున్నారు తప్ప ఆడబిడ్డ భారం అని అనుకునేవారు కనిపించడం లేదు. అయితే ఒకప్పుడు 18 ఏళ్ళు నిండాయి అంటే చాలు ఆడపిల్లకు పెళ్లి చేసేయాలి అని తెగ ఆందోళన చెందే వారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడూ ఇక బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసినా తర్వాత.. అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి ఊసు ఎత్తాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా అక్కడక్కడ అనాగరికత కొనసాగుతుంది అని ఎలుగెత్తి చూపే కొన్ని ఘటనలు తెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా 18 ఏళ్లు కూడా సరిగ్గా నిండకముందే ఏకంగా బాలికలకు పెళ్లి చేస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్.
ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు బాల్య వివాహాల చట్టం ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇటీవలే బాల్య వివాహాల విషయంలో ఇక భారత చట్టాలలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకొని ఆమెతో శృంగారంలో పాల్గొంటే రేపు కేస్ గా పరిగణించేలా భారతీయ న్యాయ సంహిత లో కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఈ కేసులో సదరు వ్యక్తికి 15ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇటీవల చర్చనీయాంశంగా మారిన మారిటల్ రేప్.. అంటే భార్య అంగీకారం లేకుండా శృంగారం పాల్గొనడం విషయంలో క్రిమినల్ కేసు ఉండాలి అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.