పెళ్ళి చేసుకోమన్న ప్రియురాలు.. కానీ అతను ఏం చేశాడో తెలుసా?

praveen
కామాంధులకు ఒంటరిగా ఉన్న యువతులను ట్రాప్ చేసి తమ కామ కోరికలను తీర్చుకోవడం, ఆపై చంపేయడం కామన్ అయిపోయింది. ఇలాంటి దారుణాలు రోజుకు ఎన్నో జరుగుతున్నా అమ్మాయిలు మగవారిని గుడ్డిగా నమ్మేసి చివరికి బలైపోతున్నారు. తాజాగా భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ యువతి కూడా ఒక కామాంధుడిని నమ్మి చివరికి దారుణంగా హత్యకు గురైంది. ఆ నీచుడు ఆ యువతికి ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబరచుకున్నాడు. తర్వాత మరొక యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మహిళా నిలదీయగా ఆమెను ట్యాంకర్ కిందకు తోసి అత్యంత ఘోరంగా చంపేశాడు.

తర్వాత శిక్ష పడకుండా తప్పించుకునేందుకు ఆ యువతి మరణం ఒక ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఈ దారుణం హైదరాబాద్‌ నగరంలోని బాచుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలోని నెమలిగుట్ట తండాలో భూక్యా ప్రమీల (23) నివసించేది. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ సిటీకి తరలివచ్చింది. 2022, జనవరిలో పెళ్లి కూడా చేసుకుంది. కానీ విధి ఆమెపై చిన్నచూపు చూడటంతో కేవలం ఏడాది కాలంలోనే భర్త మరణించాడు.

దాంతో ఆమె బతుకు భారమైపోయింది. పొట్టకూటి కోసం ఆమె సిటీలోనే మరో ముగ్గురు యువతులతో కలిసి ఉంటూ బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనికి చేరింది. సరిగ్గా ఇదే సమయంలో ఆమెకు కారు డ్రైవర్ భూక్యా తిరుపతినాయక్‌ (25) తారసపడ్డాడు. అతను ప్రమీల సొంతూరు సమీపంలోని రోడ్‌బండ తండాకు చెందినవాడు. అంతేకాదు ఆమెకు చిన్ననాటి నుంచే తెలిసినవాడు. హైదరాబాద్ సిటీకి వచ్చాక వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తర్వాత శారీరకంగా అతడు ఆమెను వాడుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత తిరుపతినాయక్‌ మరొక యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసింది ప్రమీల అతడికి ఫోన్ చేసి తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేదంటే తల్లిదండ్రులకు చెప్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం ఉదయం తనని కలవాలని తిరుపతి నాయక్‌ను చెప్పింది. దాంతో తిరుపతి తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై బాచుపల్లి మెయిన్ రోడ్డు వద్దకు వెళ్లి ఆమెను కలిశాడు. అనంతరం వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు బలంగా తోసుకున్నారు. ఈ సమయంలోనే అటువైపు నుంచి వస్తున్న  యాంకర్ కిందకు ప్రమీలను తిరుపతికి తోసేసాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తర్వాత ఇది ఒక యాక్సిడెంట్ అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు తిరుపతి. కానీ పోలీసులు అసలు నిజం చెప్పాలని నిలదీయడంతో తానే ఆ పని చేశానని ఒప్పుకున్నాడు. దాంతో తిరుపతిని పోలీసుల అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: