అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?
ఎన్నో ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన మహిళకు చివరికి దారుణంగా భర్త చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన ఆదోనిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్య అందంగా ఉందని అనుమానం పెంచుకున్న భర్త.. చివరికి దారుణంగా హత్య చేశాడు. ఆ ఇద్దరికీ ఐదేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారూ. అయితే భార్య శిరీషపై భర్త కళ్యాణ్ అనుమానం పెంచుకున్నాడు. పట్టణంలోని కిలిచిన పేటకు చెందిన నాగులు, వీరబాయి కుమారుడు కళ్యాణ్ అలియాస్ చంటి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
ఇటీవలే మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయితే కోపంతో విచక్షణ కోల్పోయిన చంటి ఏకంగా భార్య శిరీషను టవల్‌తో గొంతుకు నులిమి హత్య చేశాడు. అయితే భార్యను చంపిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో షాక్ అయిన పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని శిరీష మృద్దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా శిరీష తల్లిదండ్రులు నెల్లూరులో చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. చూసేందుకు వెళ్లారు అయితే శిరీష తల్లిదండ్రులు ఉండి ఉంటే మాత్రం ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.