ప్రియురాలు పగబట్టింది.. నాగుపాము కాటు వేసింది?

praveen
రివెంజ్.. ఈ మాట మొన్నటి వరకు కేవలం సినిమాల్లో మాత్రమే వినిపించేది. ఎందుకంటే యాక్షన్ సినిమాలలో ఒకరిని ఒకరు చంపుకుంటూ రివేంజ్ తీర్చుకోవడం లాంటి సన్నివేశాలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమాల్లో కంటే ఎక్కువగా రియల్ లైఫ్ లో కూడా  రివెంజ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనసులో పగను దాచుకుని పైకి నవ్వుతూ కనిపించి.. సమయం సందర్భం కోసం ఎదురు చూసి దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు.


 ఇక ఇలాంటి తరహా ఘటనలు రెండు రోజుల్లో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ప్రేమికుల మధ్య అయితే ఇలాంటి రివేంజ్లు ఎక్కువైపోయాయి. తమను మోసం చేశారని ఒకరు.. తమను ప్రేమించడం లేదని ఇంకొకరు.. తమను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారని మరొకరు.. ఇలా ఏదో ఒక కారణంతో రివెంజ్ తీర్చుకుంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తన ప్రియుడు తప్ప తాగి దుర్భాషలాడాడు అన్న కోపంతో ప్రియురాలు అతన్ని నాగుపాముతో కాటు వేయించి చంపించింది.  దీనిని ప్రమాదంగా భావించారు పోలీసులు. తర్వాత అనుమానంతో లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


 ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అంకిత్ చౌహన్ ఓ బిజినెస్ మాన్. అతనికి మహి ఆర్య అనే మహిళతో సాన్నిహిత్యం ఉంది. కాగా ఇటీవల దీనిలో 15న రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో అంకిత్ మృతదేహం  ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది  పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా పాముకాటుతో చనిపోయినట్లు తేలింది. అయితే ఘటన తర్వాత అంకిత్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అన్న అంకిత్ చనిపోవడానికి ఆర్య,  దీప్ ఖందపాల్ కారణం అంటూ ఆరోపించింది. అనుమానంతో పోలీసులు అంకిత్ కాల్ షీట్ ఆర్య నెంబర్ కు ఎక్కువగా వెళ్లినట్లు గుర్తించారు. ఇక ఆమె నుంచి ఉత్తరప్రదేశ్ కు చెందిన రమేష్ నాథ్ అనే పాములు పట్టి ఆడించే వ్యక్తికి కాల్స్ వెళ్ళాయ్. కాగా వారిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.. ప్రియురాలు ఆర్య ప్లాన్ ప్రకారమే అంకిత్ ను పాముకాటుతో చంపించింది అన్న విషయం తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: