తల్లిని చంపిన కొడుక్కి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?
వెరసి ఇక ఇలాంటి స్వార్థంతోనే ఏకంగా సొంత వారిని కూడా దారుణంగా హతమార్చేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కష్టాల్లో అండగా ఉంటారు అనుకున్న సొంత వాళ్లే ఇలా కడతేరుస్తుంటే ఇంకెవరిని నమ్మాలి అని ఎంతోమంది ఆందోళనలో మునిగిపోతున్నారు. అంతేకాదు ఎప్పుడు ఎవరు దాడి చేసే ప్రాణాలు తీస్తారో అని అనుక్షణం భయపడుతూనే బ్రతుకుతున్నారు. అయితే ఇలా నేరాలకు పాల్పడుతున్న వారికి కూడా అటు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవల కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకుకి న్యాయస్థానం యావజ్జీవ కారగార శిక్ష విధించింది.
ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బల్కంపేట్ లో గంజాయికి బానిసగా మారిపోయిన సంతోష్ తన కన్నతల్లి సంగీతను డబ్బుల కోసం వేధించాడు. అయితే ఆమె తన దగ్గర డబ్బులు లేవు అంటూ చెప్పడంతో చివరికి కత్తితో విచక్షణ రహితంగా తల్లిని పొడిచి చంపేసాడు. కాగా అతని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించడంతో చివరికి హైదరాబాద్ న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.