వాటర్ హీటర్.. మనిషి ప్రాణం తీసింది?
ఇక ఇవన్నీ చాలవు అన్నట్లు మరికొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు కూడా ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ప్రతిరోజూ చేసే పనుల కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో స్నానానికి ముందు నీటిని వేడి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా హీటర్ వాడుతున్నారు. ఇక నేటి రోజుల్లో హీటర్ లేని ఇల్లు లేదు అని చెప్పాలి. అయితే ఇలా ప్రతిరోజు హీటర్ పెట్టుకోవడం కామన్. కానీ అదే హీటర్ కారణంగా ప్రాణాలు పోతాయి అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా హీటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఒక మహిళ మృతి చెందింది.
ఈ విషాదకర ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శిరీష.. వేడి నీటి కోసం హీటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కి గురైంది. అయితే బాత్రూం నుంచి భార్య కేకలు విన్న భర్త వెంటనే వెళ్లాడు. అయితే అప్పటికే బాత్రూంలో భార్య కుప్పకూలిపోయి కనిపించింది. ఇక వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసిన భర్త.. ఇక స్పృహ కోల్పోయిన భార్యను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు. అయితే పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది అన్న విషయాన్ని నిర్ధారించారు. ఈ అనూహ్య ఘటనతో ఇక ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి.